దీపం-2 పథకం కింద అర్హులైన లబ్దిదారులకు ప్రతి నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలెండర్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అధికారులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా గ్యాస్ సిలెండర్ల పంపిణీకి ఎజెన్సీ నిర్వాహకులు సహకరించాలన్నారు.