బెరకా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నంలో పలువురికి ఆర్థిక, వస్తు రూపేనా సహాయం అందించారు. రాష్ట్ర మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర చేతుల మీదగా, ఇతర అధికారుల చేతుల మీదగా సహాయం అందించారు. విద్యకొరకు 21 మంది విద్యార్థులు, వైద్యం కొరకు 11 స్వయం ఉపాధి కొరకు ఇద్దరికి, గృహ నిర్మాణం కొరకు ఇద్దరికి ఆర్థిక, వస్తురూపేణ సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.