మచిలీపట్నం కుమ్మరిగూడెంలో నిషిద్ధ మడుగు భూమిలో అక్రమ నిర్మాణాలు చేసుకున్న బాధితులకు న్యాయం చేయాల్సింది పేర్ని నానీనే అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 26 ఎకరాల మడుగు భూమిలో పేదలకు నివేశన స్థలాలు మంజూరు చేసి వారితో బలవంతంగా షెడ్లు వేయించారన్నారు. దీనిపై అప్పట్లోనే తాము పోరాటం చేసినా పట్టించుకోలేదన్నారు.