జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణం పనులు ముమ్మరం చేయాలని డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లలోను, కమ్యూనిటీ హాళ్లలోనూ గృహ నిర్మాణాల లబ్దిదారులతో సమావేశాలు నిర్వహించి పిఎంఏవై పట్టణ గ్రామీణ గృహ నిర్మాణం పై అవగాహన కల్పించాలన్నారు.