అక్రమ చికెన్ వ్యర్ధాలు తరలింపు పై కేసు
కైకలూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడు మండలంలో వాహనాల తనిఖీల్లో ఆదివారం అక్రమంగా చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్న ఐషర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు ఇంచార్జ్ ఎస్సై కట్ట శారద సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ వాహన తనిఖీలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.