జగ్గయ్యపేట పట్టణంలో ఆధార్ సెంటర్ కనిపించడం లేదని ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. పోస్టాఫీసులో గల ఆధార్ కేంద్రం మూతపడటమే కాకుండా ఆధార్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయోనని ప్రజలు రోజుల తరబడి వెతుక్కుంటున్నారు. ఇప్పటికైన ప్రభుత్వ ఉన్నతాధికారులు పోస్టాఫీసులో ఆధార్ కేంద్రాని పునరుద్దరించాలని మండల తహశీల్దార్, మండల పరిషత్, మున్సిపల్ ఆఫీస్ లలో ఆధార్ కేంద్రాలను ప్రజా అవసరం కోసం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.