మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. ఆదివారం వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 8 లక్షల 3 వేల 594 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం అన్నారు.