నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికళ్యాణి విజ్ఞప్తి చేశారు. బాపులపాడులోని నూజివీడు రోడ్డులో సాయి కళ్యాణి నివాసం వద్ద మంగళవారం గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని సాయి కళ్యాణి ప్రారంభించారు.