పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కళ్యాణి కోరారు. గురువారం నాడు ఇంటింటికి వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని సాయి కళ్యాణి చేపట్టారు. ఈ సందర్భంగా సాయి కళ్యాణి మాట్లాడుతూ పట్టభద్రుల ఓట్ల నమోదుపై 1 నవంబర్ 2021 సంవత్సరానికి డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరు పట్టభద్రుల ఓటర్ నమోదుకు అర్హులేనని సాయి కళ్యాణి తెలిపారు.