బీసీల బాగే సీఎం చంద్రబాబు లక్ష్యమని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఆదివారం గన్నవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీసీ-ఏలో ఉన్న సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంచే కేంద్ర ప్రభుత్వం సహకారంతో సీడ్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాల ద్వారా మోనటరింగ్ చేయనున్నట్లు వెల్లడించారు.