నాగాయలంక పంచాయతీ పరిధిలోని కృష్ణానది రేవు నుంచి అక్రమార్కులు యద్దేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఆదివారం ఉదయం భారీగా ట్రాక్టర్లను తీసుకుని వెళ్ళి, నదిలో నుంచి ఇసుకను ట్రాక్టర్లు డంపింగ్ చేస్తున్నారు. కృష్ణా నదిలో నుంచి ఇసుక తరలింపు చేయడానికి వెళ్ళలేదని అధికారులు స్పష్టంగా చెప్పినప్పటికీ కొంతమంది అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని పలువురు కోరుతున్నారు.