నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి గ్రామ పంచాయతీలో బుధవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పనుల కొరకు గ్రామ సభలు జరిగాయి. సర్పంచి మండలి ఉదయ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిధిలో రూ. 142 లక్షల అంచనాతో 96 పనులను చేసేందుకు గుర్తించినట్లు ఎపీఓ టీవి ఎన్ ముత్యాలు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధి కూలీలు, గ్రామస్థులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.