నాగాయలంక మండలంలోని గ్రాడ్యుయేట్లు ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ నెల 6వ తేదీ గడువు ముగియటంతో వారి అర్హతలను పరిశీలించి 1105 మందిని ఓటర్లుగా గుర్తించామని తహశీల్దార్ ఎం. హరనాథ్ బాబు తెలిపారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ఆదివారం మండలంలోని 49 పోలింగ్ బూత్ లలో పోలింగ్ అధికారులు నిర్వహించగా నాగాయలంకలోని పోలింగ్ బూత్ లను తహశీల్దార్ పరిశీలించారు.