రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని వైసిపి సానుభూతిపరుడు బడే గౌతమ్ దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు శుక్రవారం ఉదయం నుంచి నియోజకవర్గంలోని 6 మండలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అవనిగడ్డ పోలీసులు గౌతమును శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.