అవనిగడ్డలోని విజయకృష్ణ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో దీపం-2 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మహాశక్తి పథకంలో భాగమైన ఏడాదికి మూడు సిలిండర్ల గ్యాస్ ఉచితంగా ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నారన్నారు.