కళాశాల దారిలో మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వవద్దని విద్యార్థినిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఈ మేరకు అవనిగడ్డలోని ఎస్. వీ. ఎల్ క్రాంతి కళాశాల విద్యార్థినులు తమ నిరసన వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంకు రోడ్డులో తమ కళాశాలకు విద్యార్థులు వెళ్లే దారిలో నూతన మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి అడ్డుకోకపోతే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.