కూటమి ప్రభుత్వంతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం తుని మండలంలో తిమ్మాపురం, వెంకటాపురం గ్రామాల్లో ఆమె పర్యటించారు. 100 రోజుల పాలనలో మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్లు, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సకాలంలో ఉద్యోగులకు జీతాలు వంటి కార్యక్రమాలతో సంక్షోభంలోను సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు.