సఖినేటిపల్లి మండలం రామేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు డీఈవో సలీం భాష కూరగాయల విత్తనాలు, చేతి సంచులను శుక్రవారం పంపిణీ చేశారు. మానవతామూర్తు-సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అమోఘమైనవని డీఈఓ పేర్కొన్నారు. ప్లాస్టిక్ లోకాన్ని తరిమికొట్టేందుకు సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఈ తరహా చర్యలు చేపట్టడం ఆనందకరమన్నారు.