రాజోలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పోస్టు ఆఫీసు ప్రహారీ గోడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాజోలు ఇంఛార్జి తహశీల్దార్ మృత్యుంజయ రావు గురువారం అక్కడికి చేరుకుని పోస్టు ఆఫీసు భవన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణం నిలుపుదల చేయాలని కాంట్రక్టర్ కు సూచించారు.