అక్టోబర్ 14 నుంచి 20 వరకు పల్లె పండుగ రహదారి, డ్రెయిన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆగస్టు 23న గ్రామ సభలో గుర్తించిన పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చెయ్యాలని ఆమె ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రశాంతి పాల్గొన్నారు.