ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమండ్రిలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, తహశీల్దార్ పీ హెచ్ జీ ఆర్ పాపారావులతో కలిసి కలెక్టర్ పోలింగ్ కేంద్రాలు 29, 30 ను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 5వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ పోలింగు జరుగుతోందన్నారు.