తూ. గో జిల్లాలో దీపం-2 పథకం కింద 5, 29, 070 మందికి రూ. 76 కోట్ల 95 లక్షల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని రోటరీ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జేసీ చిన్న రాముడు, దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీకి జిల్లాలో శ్రీకారం చుట్టామన్నారు.