పెద్దాపురం మండల పరిధిలోని 23 గ్రామాల్లో నిర్వహించిన రీ సర్వే గ్రామసభల్లో ప్రజల నుంచి 566 ఫిర్యాదులు అందాయని తహశీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదులన్నీ 15 రోజుల్లోగా పరిశీలించి సరిదిద్దుతామన్నారు. ఈ ఫిర్యాదుల్లో చిన్న చిన్న తేడాలను గ్రామ సర్వేయర్, వీఆర్వోలు, పెద్దవైతే మండల స్థాయిలో సరిదిద్దుతారన్నారు.