పెన్షనర్స్ సంఘం నిడదవోలు శాఖ అధ్యక్షుడు బలగం అప్పారావు అధ్యక్షతన ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి ప్రధాన కార్యదర్శి కీర్తి ఆంజనేయులు, సభ్యులు చర్చించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ చీఫ్ బ్రాంచ్ మేనేజర్ లాల్ ని ఆహ్వానించి, వారి నుంచి పెన్షనర్లందరికీ చక్కని సహకారం అందించాలని కోరారు.