నిడదవోలు రూరల్ తాడిమళ్ల గ్రామం దళిత పేటలో మద్యం షాపు ఏర్పాటు చేయటాన్ని వెంటనే విరమించుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేశారు. కాలనీలో కొత్తగా దుకాణం పెట్టడం వలన మహిళలు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో యువతలో ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుంటుందన్నారు. షాపును ఇక్కడ పెట్టే ఆలోచనను విరమించుకోవాలని లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.