మండపేటలో రెల్లి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు దళిత యువకులపై అగ్రవర్ణ యువకుల దాడిని నిడదవోలు రెల్లి సంఘం తీవ్రంగా ఖండించింది. ఆదివారం నిడదవోలులో నిరసన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ సినిమా థియేటర్లో బైక్ స్టాండ్ వద్ద చిన్న సమస్యపై వచ్చిన ఉద్రిక్తత అగ్రకుల అహంకారంతో పెద్దదై సర్ది చెప్పడానికి వచ్చిన యువకులపై దాడి చేశారన్నారు.