డాక్టర్ బి. ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని 8వ వార్డులో బుధవారం దోమల నివారణ మందును పిచికారి చేశారు. కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ ఆద్యంతం దగ్గరుండి దోమల మందును పిచికారి చేయించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా దోమల నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇంటింటికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని కోరారు.