ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి హామీ ఇచ్చారు. మండపేట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్మన్ దుర్గారాణిని కలిసేందుకు వచ్చిన నగర ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. పలువురు పలు సమస్యలను చైర్మన్ దుర్గారాణికి విన్నవించుకున్నారు.