బహుజన సమాజ్ పార్టీ బలోపేతం, పార్టీ సభ్యత్వాలపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని రాష్ట్ర అధ్యక్షులు పి. పరంజ్యోతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో రావులపాలెం పార సంస్థ ఆవరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జ్ ల ముఖ్య సమావేశం నిర్వహించారు. జిల్లా నాయకులు, నియోజవర్గ నాయకులు, పార్టీ కోసం కృషి చేయాలని తెలిపారు.