నవంబర్ 2 న రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాదిగ ఉప కులాల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎంఆర్ పిస్ జిల్లా అధ్యక్షులు అనంతరపు రాజు మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులువల్లూరి సత్తిబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో జరిగిన విస్తృ స్థాయి సమావేశం వారు మాట్లాడుతూ.. మాదిగ, ఉపకులాలు ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.