కాకినాడ జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోసన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపి, అత్యవసర విభాగం, ఐసీయూ, మెటర్నటీ, లేబర్ వార్డు డయాలసిస్ విభాగాలను నిశితంగా పరిశీలించారు. ఓపి విభాగంలో రోగుల బంధువులతో మాట్లాడారు. సమయానికి సక్రమంగా వైద్యం అందుతుందా లేదో అని అడిగారు. అందుతున్న వైద్యం, పర్యవేక్షణ తదితర అంశాలను ప్రశ్నించి ఆరా తీశారు.