ద్వారకాతిరుమల గ్రామంలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గోపాలపురం వాణిజ్య సెల్ అధ్యక్షుడు ఇమ్మడి రత్నాజీ ఆధ్వర్యంలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సుమారు 100కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించారు. పార్టీ సభ్యత్వం చేయించుకుంటే కలిగే ప్రయోజనాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రత్నాజీ వివరించారు.