తూర్పుగోదావరి జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఎం. మోహన్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి, భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజకీయ నాయకులు, ప్రజల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.