దసరా పర్వదినం విజయదశమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గోకరకొండ సూరిబాబు సౌజన్యంతో అమలాపురం పట్టణ మూడవ వార్డు పారిశుధ్య కార్మికులకు శనివారం ఉచితంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ దుస్తులు పంపిణీని వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ప్రతిపక్ష నేత అయిన యేడిద శ్రీను చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.