అయినవిల్లి: గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత

72பார்த்தது
అయినవిల్లి మండలం శంకరాయగూడెం, కె. జగన్నాధపురం గ్రామాలలో పల్లె పండగ ప్రగతికి అండగా కార్యక్రమంలో భాగంగా ఎమ్. ఎన్. ఆర్. ఈ. జీ. ఎస్ నిధులతో నిర్మించబోయే సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி