నియోజకవర్గంలో అనేక గ్రామాలలో లోవోల్టేజీ సమస్య అధికంగా ఉందని దీనిని నివారించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అనపర్తి పంచాయతీ కార్యాలయంలో నియోజకవర్గ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.