కాకినాడ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన సీఎం చంద్రబాబును పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా వర్మ గొల్లప్రోలు, పిఠాపురం, యు. కొత్తపల్లి ప్రాంతాల్లో వరద ముంపుతో భారీ నష్టం వాటిల్లిందని, వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అంతేగాకుండా వరద ముంపు ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను సీఎం చంద్రబాబు దృష్టికి వర్మ తీసుకెళ్లారు.