సామర్లకోట: వృధాగా పోతున్న త్రాగునీరు
పెద్దాపురం పుర ప్రజలకు త్రాగునీరు అందించే పైప్ లైన్ కు లీకులు ఏర్పడి పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతున్న అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. సుమారు నెలరోజులు పైబడి సామర్లకోట - పెద్దాపురం వాటర్ ట్యాంక్స్ కి వెళ్లే త్రాగునీరు సామర్లకోట విమల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా పైప్ లైన్ నుండి పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతుంది. సమస్యను మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకెళ్లిన మరమత్తులు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు.