రాయచోటి లోని టిడిపి కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం అమరావతి లోని మూడవ భవనంలోని రెండవ అంతస్తులో మంత్రి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.