రైల్వే కోడూరు నందు ఉదయం నుంచి భారీ వర్షం
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో, రైల్వే కోడూరు గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్షం కొంచెం కొంచెంగా పెరుగుతూ, ఉదయం 6 గంటలకి జోరుగా కురిసింది. ఈ వాన కారణంగా రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. కొన్ని దుకాణాల్లోకి కూడా వాహనాలు మెయిన్ రోడ్డుపై వెళ్ళినప్పుడు నీరు లోపలికి రావడం జరిగింది. ప్రజలు ఈ పరిస్థితితో ఇబ్బందులు పడుతున్నారు, వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.