రైల్వే కోడూరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు వేగవంతం కావాలని అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో సమర్థవంతంగా పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. అత్యధికంగా సభ్యత్వ నమోదు చేసేందుకు అందరూ కలిసి కృషి చేద్దామని నియోజకవర్గ, మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులు అందుకు సహకరించాలని కోరారు.