రాష్ట్రంలోనే కోడూరు నియోజకవర్గం ప్రధమ స్థాయిలో ఉండేలా ప్రతి గ్రామంలోనూ సభ్యత్వాలు నమోదు చేయాలని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తెదేపా నాయకులు, అభిమానులు పండుగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజలకు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి సభ్యత్వం నమోదు చేయించాలన్నారు.