రైల్వే కోడూరు: సీఎం సహాయ నిధి పేదలకు వరం

67பார்த்தது
రైల్వే కోడూరు: సీఎం సహాయ నిధి పేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, టిడిపి నియోజకవర్గ బాధ్యులు రూపానందరెడ్డి అన్నారు. శుక్రవారం రైల్వే కోడూరు టిడిపి కార్యాలయంలో ఐదు లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లించి పేదలను ఆదుకుంటుందని వారు అన్నారు. సహాయం కావలసినవారు తమను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி