రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా గోశాల దేవిని నియమించినట్లు ఆమె తెలిపారు. సోమవారం రైల్వే కోడూరులో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రెండవసారి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి, డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.