వేంపల్లి: ధరలు పెరుగుదలతో పండుగ పూట పస్తులే
కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్య ప్రజలు పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఆదివారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచిందని, ధరలు సలసల కాగుతున్నట్లు వెల్లడించారు. కందిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు అమాంతంగా పెరిగాయన్నారు.