రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ పెద్ద ఓబన్న అన్నారు. పులివెందుల తొండూరు మార్గమధ్యంలో ఇనగలూరు గ్రామం వద్ద బుధవారం మొగమూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో, పరిసరాలను ఆయన పరిశీలించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని రెండు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.