సింహాద్రిపురంలోని హిమకుంట్ల క్రాస్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం ఎస్ఐ ఎస్ఎండీ షరీఫ్ వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఎస్ఐ సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.