ప్రొద్దుటూరు పట్టణంలోని గీతాశ్రమం వీధికి చెందిన చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగి పూడూరు నరసింహారెడ్డి (75) అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన కుమార్తె విప్లవ రచయితల సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మీ కడప రిమ్స్ మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని అప్పగించారు. అంతేకాకుండా స్నేహ సేవా సమితికి కార్నియాలు అందజేశారు.