భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు మదనపల్లి సిఐ కళా వెంకటరమణ తెలిపారు. బసినికొండ శివాలయం వీధిలో ఉంటున్న షేక్ నదియా (23)ను ఆమె భర్త గౌస్ భాష మానసికంగా వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలిపారు. గౌస్ భాషా పై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలియజేశారు.