అవుకు రిజర్వాయర్ నుంచి 9,000 క్యూసెక్కుల కృష్ణ నీరు గండికోట జలాశయంలోకి వచ్చి చేరుతున్నట్లు గురువారంఅధికారులు తెలిపారు. జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్‌కు 9,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు జల వనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం 26 టీఎంసీ నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గండికోట జలాశయంలో 694.65 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.